![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ ఇంట్లో నయని పావని(Nayani Pavani) ఎలిమినేషన్‌ను అందరూ ముందుగానే ఊహించారు. నయని పావని నామినేషన్‌లోకి వస్తే బయటకు పంపేద్దామని జనాలు కూడా రెడీగానే ఉన్నారు. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చిన టైంలో నయని గనుక నామినేషన్‌లో ఉండుంటే మళ్లీ ఫస్ట్ వీక్ ఆటకే బయటకు వచ్చేది. కానీ అప్పుడు గౌతమ్ నామినేషన్ షీల్డ్ ఇచ్చి కాపాడేశాడు. నయని ఎప్పుడు డేంజర్ జోన్‌లోనే ఉంటూ వచ్చింది. ఈ సారి మాత్రం బయటకు వచ్చేసింది.
ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక బిగ్ బాస్ బజ్(Biggboss Buzz) ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చింది. ఇందులో నయని(Nayani Pavani)రాగానే తనకి ఓ మెడల్ మెడలో వేసి బజ్ ఇంటర్వ్యూ మొదలెట్టాడు యాంకర్ అంబటి అర్జున్. ఇక హౌస్ లో తన పర్ఫామెన్స్ చూసి జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూపించారు. అందులో తన ఏడుపే జీవించడంతో తనకి కూడా సీన్ అర్థమైంది. ఇక ఏం చేయలేకపోయింది నయని. బిగ్ బాస్ సీజన్-7 లో ఉన్న నయనికి , సీజన్-8 లో ఉన్న నయనికి తేడా ఏంటని యాంకర్ అడుగగా.. అది వేరు వేరు అని చెప్పింది. ఏ సీజన్ సిమిలర్ గా ఉండదని యాంకర్ అన్నాడు. నాకైతే ఎందుకో నామినేషన్ లోనే ఎలిమినేషన్ అవుతానేమోనని మీరు భయపడ్డారని అనిపించిందంటూ యాంకర్ అనగా.. ఆశ్చర్యంగా చూసింది నయని.
హౌస్ లో టాస్క్ లు అర్థం కాని వాళ్ళని చూశాను కానీ నామినేషన్ లు అర్థం కానీ వాళ్ళని ఫస్ట్ టైమ్ చూస్తున్నానని యాంకర్ అనగానే.. నా నామినేషన్ ఏంటో నాకు క్లారిటీ ఉందని నయని పావని అంది. నీకేదైన ఒకే విషయాన్ని పది సార్లు చెప్పే అలవాటు ఉందా అని యాంకర్ అనగా తెలియదని నయని అంది. ఒక్కసారి చెప్తే ట్రోమా ఇన్ని సార్లు చెప్తే డ్రామా అని అర్జున్ అన్నాడు. క్లాన్ నయని గురించి ఆలోచించదు కానీ నయని ఆలొచిస్తుందని యాంకర్ అడుగగా.. నేను క్లాన్ కోసమే ఆడాను కానీ నా క్లాన్ వాళ్ళే వచ్చి నేనేం ఆడానని అన్నారంటూ నయని చెప్పుకొచ్చింది. మళ్లీ ఇంకో సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే వెళ్తావా అని యాంకర్ అడుగగా.. లేదన్నట్టుగా తల ఊపేసింది నయని. ఇక నయని మీద వేసిన కొన్ని ట్వీట్స్ ని ప్లే చేసి చూపించారు. ఇక హౌస్ లో ఎవరేంటో తెలియాలంటే నయని హౌస్ మేట్స్ గురించి చెప్పిన ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.
![]() |
![]() |